ఐదేళ్ల పదవీ కాలంలో జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదని, లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా అంచుకుకు నెట్టి వేశాడని ఆరోపించారు. తను చేసిన నిర్వాకానికి కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు చేసినా తీర్చలేని దుస్థితి నెలకొందన్నారు. రాను రాను రాష్ట్రాన్ని నడపడం ఇబ్బందిగా మారిందన్నారు. తెచ్చిన అప్పులు వడ్డీలకే సరిపోతోందని వాపోయారు.