కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయినా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ప్లకార్డులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగస్తున్నారని అన్నారు.