దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ నిజామాబాద్ కలెక్టరెట్ లో ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.