దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ కామారెడ్డి జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మహాత్మా గాంధీ చేసిన సేవలను ఈ సందర్బంగా కొనియాడారు.