పెనుగొండ టిడిపి కార్యాలయంలో మహాత్మా గాంధీజీ వర్ధంతిని మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆమె గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసే నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 11 సీట్లకే పరిమితమై వైసీపీ నేడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేవలం వాళ్ల ఉనికిని చాటుకోవడానికి టిడిపి ప్రభుత్వం పై నిందలు మోపుతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు కచ్చితంగా అమలు జరుగుతుందన్నారు.