జాతిపిత గాంధీకి ఘనంగా నివాళి
NEWS Jan 30,2025 08:00 am
జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతిని వెంపేట్ గ్రామంలో నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి. ఈ సందర్బంగా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. బాపు బలిదానం వల్లనే దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లి శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పుల్ల శేఖర్ గౌడ్, బద్దం స్వామి రెడ్డి, కల్లెడ గంగాధర్, ఎల్లల బాపు రెడ్డి, ధర్మరాజు, పూరషోత్తం, రాజు, చిట్యాల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.