మాఘ అమావాస్య పురస్కరించుకొని బుధవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని భీమేశ్వర జాతరలో భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.