హైదరాబాద్ లోని బొల్లారం ఆర్మీ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. విద్యార్థులను ఇంటికి పంపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. మొయిల్ ద్వారా ఆగంతకులు బాంబు బెదిరింపు మెసేజ్ చేశారు. తమిళనాడు నుంచి బాంబు బెదిరింపు వచ్చినట్టు గుర్తించారు. ఆకతాయిల పనిగా తేల్చేశారు ఆర్మీ ఆఫీసర్స్. దీంతో పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థులు, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.