మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. బుధవారం రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి ఆధ్వర్యంలో మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు యండి జాఫర్, మిట్టపెల్లి రాజేందర్, ఏడ్ల రాజు, గంగారెడ్డిలు పాల్గొని పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.