మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ
NEWS Jan 29,2025 11:36 am
మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, దరఖాస్తులను పరిశీలించారు. ప్రజా పాలన సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. అధికారులు సమయ పాలన పాటించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డిఓ శ్రీనివాస్, తహశీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ తదితర అధికారులు ఉన్నారు.