సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ పేర్కొంది. ఆయన ఫిబ్రవరి 1న ప్రచారం చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున బాబు ప్రచారం చేయనున్నారు. తెలుగు ప్రజలు అత్యధికంగా రాజధానిలో నివాసం ఉన్నారు. వారి ఓట్లను అభ్యర్థించనున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు.