ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించనున్నారు. రెండో సారి డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వెళ్లనున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల అధినేతలు వివిధ అంశాలపై చర్చించనున్నారని కేంద్రం వెల్లడించింది. కాగా ట్రంప్ వచ్చాక అక్రమ వలసదారులపై వేటు వేశారు. ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీని గురించి మోడీ ప్రస్తావించే ఛాన్స్ ఉంది.