కౌలాలంపూర్ వేదికగా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తెలంగాణ బిడ్డ త్రిష గొంగిడి చరిత్ర సృష్టించింది. కేవలం 53 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. మహిళా క్రికెట్ చరిత్రలో తనదే రికార్డ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. భవిష్యత్తులో త్రిష గొంగిడి టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. అద్భుతమైన ఫీట్ సాధించడం గొప్ప విషయమన్నారు.