ఏపీ బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గురించి నోరు పారేసుకున్నారు. నర హంతకులు ఎల్టీటీఈ ప్రభాకర్ , నయీమ్ లతో గద్దర్ ను పోల్చాడు. భారత రాజ్యాంగం పట్ల నమ్మకం లేని గద్దర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్ మావోయిస్ట్ కు చెందిన లీడర్ అంటూ ఆరోపించారు. గద్దర్ కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు.