బాలీవుడ్ సింగర్ జనై భోంస్లే సీరియస్ గా స్పందించారు. తాను హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో డేటింగ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. తను లవర్ కాదని సోదరుడంటూ పేర్కొన్నారు. స్టార్ల వ్యక్తిగత విషయంలో కొంచెం సంయమనం పాటించాలని కోరారు. ఇలాంటివి ప్రచారం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని, తట్టుకోవడం కష్టమని పేర్కొన్నారు. కాగా జనవరి 23న బర్త్ డే పార్టీకి హాజరైన మాట వాస్తవమేనన్నారు సిరాజ్.