76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన నివాసంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక దేశం భారత దేశం అన్నారు. రాజ్యాంగం అనేది దేశానికి గుండె కాయ లాంటిదన్నారు. అనంతరం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.