మాజీ ఎంపీ చింతా మోహన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. అమరావతి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్ల అప్పులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం దివాళా అంచున ఉందని, ఆరు గ్యారెంటీలు అమలుకు లక్షల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. ఈ తరుణంలో కేపిటల్ సిటీకి ఇన్ని కోట్లు తీసుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు.