సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన హయాంలో ఏపీ రాష్ట్ర ఇమేజ్ పూర్తిగా పాడైందన్నారు. దీనిని తిరిగి నిలబెట్టేందుకు తాను శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ ఇమేజ్ మరింత పెరిగిందన్నారు. ఏడు నెలల్లో పునరుద్దరించానని తెలిపారు. అమరావతి అన్ని రంగాలలో బెస్ట్ సిటీగా మార బోతోందన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించామన్నారు.