నందమూరి నట సింహానికి అరుదైన గౌరవం లభించింది. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సినీ రంగానికి సంబంధించి దక్షిణాదిన తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో అజిత్ కుమార్, నటి శోభనతో పాటు నందమూరి బాలకృష్ణకు లభించాయి. ఈ సందర్బంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు బాలయ్యను అభినందనలతో ముంచెత్తారు.