కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ పై నిప్పులు చెరిగారు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి. ఆధారాలు లేకుండా తమ ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం దారుణమన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు బండికి లేదన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో జనానికి తెలుసన్నారు. గాంధీని చంపిన గాడ్సే ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.