టాటా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ముంబయిలో నిర్వహించిన అంతర్జాతీయ మారథాన్ అథ్లెటిక్స్ పోటీల్లో కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న అశోక్ పాల్గొని 4వ స్థానంలో నిలిచాడు. కలెక్టర్ సంగ్వాన్‌ను డీటీవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి హోంగార్డు అశోక్ కలవగా అభిందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రోత్సహించిన జిల్లా రవాణా శాఖ అధికారులకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సూపర్ న్యూమరీ విధానంలో హోం నుంచి కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించాలని కోరారు.