ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తారంటూ అంటూ నిలదీశారు. చింతల్ బస్తీ లోని షాదాన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలు కూల్చి వేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు ఆగాలని అన్నారు. ఆపక పోతే తాను ఆందోళన చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.