దావోస్ లో సీఎం చంద్రబాబు బిజీ
NEWS Jan 22,2025 06:02 am
సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు దావోస్ పర్యటనలో. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రముఖులతో భేటీ అయ్యారు. మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చర్చించారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం అయ్యారు సీఎం. బిల్ గేట్స్ తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.