రెడ్ బుక్ లో ఉన్న వాళ్లను వదలం
NEWS Jan 21,2025 03:17 am
మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ లో నమోదు చేసిన పేర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించారని, అరెస్ట్ లకు పాల్పడ్డారని అన్నారు. వ్యక్తిగతంగా దాడులకు పాల్పడిన వారిని వదలబోమంటూ పేర్కొన్నారు.