జగిత్యాలలో విద్యుత్ ఆర్టిజన్స్ రిలే నిరాహార దీక్షలు
NEWS Jan 20,2025 02:24 pm
విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట TVAC JAC ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కన్వర్షన్ చేయడం ద్వారా సంస్థకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. రవీందర్, తిరుపతి, రమేష్, శ్రీనివాస్, రాజు, సంతోష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.