ఫిబ్రవరిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్..?
NEWS Jan 19,2025 07:17 am
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించేందుకు సిద్దమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదల చేయనుంది. మార్చి 3న రెండవ విడత ఎన్నికలు, 10న మూడవ విడత ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అనంతరం 21 నుండి 10వ తరగతి పరీక్షలు చేపట్టాలని ఆదేశించింది.