ఘనంగా మహిపాల్ రెడ్డి వర్ధంతి వేడుక
NEWS Jan 20,2025 08:03 am
కమ్మర్ పల్లి మండలంలోని చౌట్ పల్లిలో మాజీ మంత్రి స్వర్గీయ ఏలేటి మహిపాల్ రెడ్డి 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న మహిపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, తనయులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఏలేటి నాగార్జున్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి సమాధిపై పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించారు.