విధిగా హెల్మెట్..సీట్ బెల్టు ధరించాలి
NEWS Jan 09,2025 09:50 am
ప్రమాదాల బారిన పడకుండా, ఎంతో విలువైన ప్రాణాలను కాపాడు కునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.