సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
NEWS Jan 09,2025 09:08 am
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణీకులను వారి గమ్య స్థానాలను చేరవేసేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 10,11,12 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఛార్జీలను సవరించినట్లు ప్రకటించారు.