ఫార్ములా ఇ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్ట్ చేయొద్దంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే విచారణ చేపట్టాలని దాఖలు చేసిన పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికప్పుడు విచారణ కుదరదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని స్పష్టం తీర్పు చెప్పింది. ఇవాళ కేటీఆర్ ఏసీబీ ముందు తన లాయర్ తో కలిసి విచారణకు హాజరయ్యారు.