మండల విద్యాశాఖ అధికారికి సత్కారం
NEWS Jan 07,2025 03:09 pm
బుచ్చియ్య పేట మండలం తురకలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి -2బుద్ధ కాశీని నోబుల్ టీచర్ అసోసియేషన్ నూతన సంవత్సర సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ విజిట్ సందర్భంగా తురకలపూడి హైస్కూల్ సందర్శించి మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు సి హెచ్ వై రాజేంద్రప్రసాద్, నోబుల్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీ రమణ పాల్గొన్నారు.