ఆర్ భీమవరంలో సినిమా షూటింగ్ సందడి
NEWS Jan 07,2025 06:12 am
బుచ్చియపేట మండలం ఆర్ భీమవరంలో వెంకటరామయ్య గారు తాలూకా మూవీ షూటింగ్ గ్రామ రామాలయం వద్ద సందడిగా జరిగింది. గ్రామంలో మహిళలు, యువత ఉదయం నుండి ముగ్గుల పోటీ ప్రారంభించారు. మొదటగా రాములు వారిని దర్శించుకున్న నటి సుధ ముగ్గులను పరిశీలించి నటుడు మురళి గౌడ్ చేతులు మీదుగా గ్రామ సర్పంచ్ అమ్మునాయుడు, మాజీ సర్పంచ బాబ్జి ఎంపీటీసీ శ్రీనివాస్ రావు బహుమతులు ఇచ్చారు. అనంతరం ఉగాది నేపథ్యంలో సాంగ్ రోల్ షూటింగ్ చేశారు. గ్రామంలో సినిమా షూటింగ్ జరగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.