సీఎంఆర్ కాలేజీ ఘటనలో ఇద్దరు అరెస్ట్
NEWS Jan 05,2025 12:37 pm
సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సీక్రెట్ గా బాత్రూంలో ఆడపిల్లలు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే వ్యక్తుల ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ దురుద్దేశ పూర్వకంగా చేసినట్లు వెల్లడైంది. కాలేజ్ చైర్మన్ గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతితో సహా మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.