భట్టి విక్రమార్క కాన్వాయ్ లోని వాహనం బోల్తా
NEWS Jan 05,2025 12:05 pm
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ కు వెళుతుండగా కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో భట్టి, ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.