సినిమా రంగానికి కూటమి సర్కార్ సపోర్ట్
NEWS Jan 05,2025 03:40 am
తమ ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పరిశ్రమపై వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని కావాలని చిన్నచూపు చూసిందని ఆరోపించారు. టికెట్ల ధర పెంపు వల్ల సర్కార్ కు ఆదాయం సమకూరుతుందన్నారు. చంద్రబాబు సినిమా రంగం అభివృద్దికి తోడ్పాటు అందించారని చెప్పారు. గేమ్ ఛేంజర్ సక్సెస్ కావాలని కోరారు.