జగన్ రోడ్లపై తిరిగితే బెటర్
NEWS Jan 05,2025 03:19 am
మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చాలక తమపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యే ప్రజల్లోకి వస్తే మంచిదని హితవు పలికారు. గాలిమోటర్లలో కాకుండా రోడ్లపై తిరిగితే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు . మధ్యాహ్న భోజనం పెట్టాం, అన్న క్యాంటీన్లు తెరిచాం.. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు.