నేనైతే వాళ్లను జైళ్లో వేసేవాడిని
NEWS Jan 04,2025 12:27 pm
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల విషయంలో సీఎం మెతక వైఖరి అవలంభిస్తున్నారని కానీ తాను గనుక రేవంత్ స్థానంలో ఉంటే వీళ్లను జైల్లో వేసి ఉండే వాడినంటూ స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినంత మేర దండుకున్నారని ఇప్పుడు జనం కోసం అంటూ కొత్త డ్రామాలకు తెర లేపారంటూ ధ్వజమెత్తారు.