చైనా వైరస్ పట్ల జర జాగ్రత్త
NEWS Jan 04,2025 06:54 am
చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ స్పష్టం చేశారు.ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. లక్షలాది మంది చైనీయులు ఈ వ్యాధి బారిన పడ్డారు. చికిత్స కోసం బారులు తీరారు.