సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై సీరియస్ గా స్పందించింది రాష్ట్ర మహిళా కమిషన్ . ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. కాలేజీలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కాలేజీకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ లో స్టూడెంట్స్ బాత్రూంలో వీడియో రికార్డింగ్ చేసినట్లు ఆందోళన చేపట్టారు.