తూప్రాన్ పట్టణానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ పోతరాజు ధనరాజ్ ఇప్పటి వరకు 34 సార్లు రక్తదానం చేశాడు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి జన్మదిన పురస్కరించుకొని ఏటా జనవరి ఒకటో తేదీన రక్తదానం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సంవత్సరంలో 3 సార్లు రక్తదానం చేస్తానని తెలిపారు.