సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Dec 26,2024 06:47 pm
మల్యాల కేంద్రంలో కొత్తపల్లి బ్రదర్స్ & నల్ల ముత్తు పార్ట్నర్స్ నూతనంగా నిర్మించిన సూపర్ మార్కెట్, టీ స్టాల్ ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. సూపర్ మార్కెట్లోని సరుకులను పరిశీలించి, వినియోగదారులకు నాణ్యమైన సరుకులను అందజేయాలని సూచించారు. అనంతరం టీ స్టాల్ లో టీ తాగుతూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు. ఆయన వెంట సీఐ నీలం రవి, ఆనందరెడ్డి, శోభారాణి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, తిరుపతి, మల్లేశం, హరినాథ్, అనిల్ మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు వున్నారు.