బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
NEWS Sep 13,2026 10:46 am
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. భద్రకాళి బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన బండ్ అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై అధికారులకు పలు సూచనలు చేశారు.