సినీ రంగ అభివృద్దికి కృషి చేస్తామని కానీ ప్రభుత్వానికి సహకరించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సంధ్య థియేటర్ ఘటనతో పాటు గద్దర్ అవార్డుకు సంబంధించి చర్చ జరిగింది. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల రేట్లు పెంచడం కుదరదని, మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.