మడకశిర మండలం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం మహా మండల పూజ కార్యక్రమాన్ని మడకశిరలో వైభవంగా నిర్వహించారు.అర్చకుల ఆధ్వర్యంలో అయ్యప్పకు అభిషేకంతో పాటు ప్రత్యేక పూల అలంకరణలతో పూజ చేశారు.అనంతరం అయ్యప్ప స్వామి సంకీర్తన చేశారు.అయ్యప్ప స్వాములు పిలుపు మేరకు మడకశిర నియోజకవర్గం ఏపీ డబ్ల్యూ జె అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.మహా పూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భక్తి కీర్తనలను ఆలపించారు.