విజయ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు
NEWS Dec 25,2024 05:35 am
ఏపీ ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. ఐపీసీ 120బీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7,13(2), రెడ్ విత్ 13(1a) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. జగన్ రెడ్డి సర్కార్ కు అనుకూలంగా ఉండేలా అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని, ఇష్టానుసారంగా నియమించారని పేర్కొంది