జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లు
NEWS Dec 24,2024 06:00 am
శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు వచ్చే జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.