1.18 లక్షల టిడ్కో గృహాలు పూర్తి చేస్తాం
NEWS Dec 23,2024 11:55 am
వచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. రాజధాని అమరావతి అభివృద్ది పనులకు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి దాకా 4,54,706 గృహాలను గ్రౌండ్ చేశామన్నారు. ప్రతి యూనిట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయని తెలిపారు.