ప్రముఖ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని థానే ఆస్పత్రిలో చేరారు. అవసరమైన పరీక్షలు చేపట్టారు. కాంబ్లీ వయసు 52 ఏళ్లు. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు టెండూల్కర్ తో కలిసి తమ క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నారు. చిన్ననాటి సంగతులను పంచుకున్నారు.