అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం
NEWS Dec 22,2024 05:27 am
బీజేపీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అల్లు అర్జున్ కేసుపై స్పందించారు. ఆయనకు వంత పాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎవరో ప్రేరేపించింది కాదన్నారు. హీరోగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వెళ్లారని, ప్రచారం కోసం కాదన్నారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న హీరోను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆయన అరెస్ట్ అక్రమం అన్నారు ఎంపీ.