కొర్రపత్తి స్కూల్ ను అభివృద్ది చేస్తా
NEWS Dec 22,2024 04:24 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తన ట్రస్టు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎంపీపీ స్కూల్ ను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా అక్కడి బడి పిల్లలతో ముచ్చటించారు. పాఠశాలలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు ఇస్తానని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ స్లాబ్, ప్రహరీగోడను చేపట్టాల్సి ఉందని , వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు.